Monday, 25 November 2019

Amendments to Constitution of India 26.11.1949 - 26 . 11. 2019 = 70 years

భారత రాజ్యాంగానికి ఇప్పటి వరకు 103 సవరణలు జరిగాయి. 

భారత తొలి లోక్‌సభ ఎన్నికలు (1952) జరగకముందే.. రాజ్యాంగంలో తొలి సవరణ నమోదైంది. అప్పటి తాత్కాలిక పార్లమెంట్‌ 1951లో ఈ సవరణ చేసింది. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఆర్థికంగా వెనుకబడినవర్గాల అభ్యున్నతికి చర్యలు చేపట్టే అధికారాన్ని ఈ సవరణ ద్వారా ప్రభుత్వానికి కట్టబెట్టారు. 

103వ రాజ్యాంగ సవరణ కూడా సామాజిక న్యాయానికి సంబంధించినది కావడం విశేషం. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 % రిజర్వేషన్లను ఈ సవరణ దఖలుపరిచింది. 

ఇక.. ఇందిరాగాంధీ హయాం(1976)లో చేసిన 42వ సవరణ రాజ్యాంగంలోని వివిధ అంశాలకు సంబంధించి తీవ్ర మార్పుల్ని చేసింది. 
రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్టు, సెక్యులర్‌ అన్న పదాలను చేర్చింది. చట్టాల రాజ్యాంగబద్ధతను న్యాయస్థానాలు ప్రశ్నించాలంటే అందుకు కనీస సంఖ్యలో న్యాయమూర్తులు ఉండాలని నిబంధన పెట్టింది. కేంద్ర చట్టాల్ని కొట్టి వేయాలంటే.. రెండింట మూడోవంతు మెజారిటీ ఉండాలని మార్పులు చేసింది.

No comments:

Post a Comment