తూర్పుగోదావరి జిల్లాలోని కోరింగ వన్యప్రాణి అభయారణ్యంలో కొంత భాగాన్ని ఎకో సెన్సిటివ్(పర్యావరణ హిత) జోన్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 235.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యంలో 187.14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. కాకినాడకు సమీపంలో గోదావరి తీరంలో ఉన్న అభయారణ్యంలో కోరింగ, కోరింగ ఎక్స్‌టెన్షన్, భైరవపాలెం రిజర్వు ఫారెస్టు ఉన్నాయి. ఇక్కడ 234 జాతుల పక్షులు ఉన్నాయి. వీటిలో అరుదైనవి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించినట్టు కేంద్రం పేర్కొంది. అయితే, అభయారణ్య పరిసర గ్రామాల ప్రజలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో పోర్టు వైపు వదిలేసి తూర్పు వైపునే ఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తిస్తున్నామని స్పష్టం చేసింది. కాగా, ఈ జోన్‌లో పరిశ్రమల ఏర్పాటు నిషేధమని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు, అభిప్రాయాలు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం 60 రోజుల సమయం ఇచ్చింది. కాగా, ఎకో సెన్సిటివ్ జోన్‌ను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కేంద్రం పర్యవేక్షణ కమిటీని నియమించింది.
Saturday, 18 January 2020
Coringa (Mangrove forest)

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment